🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 04 Aug, 2026 | Page: 1

ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి చల్లా బాబుకు ఆహ్వానం

పుంగనూరు, ఆగస్టు 4 (రాజనీతి): డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్, పీఈఎస్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9న పుంగనూరులో నిర్వహించనున్న ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా బాబును ట్రస్ట్ ప్రతినిధి పి. అయూబ్ ఖాన్ ఆహ్వానించారు. తాటిమకులపాళ్యం రోడ్డులోని ఎంసీవీ డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభం కానుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
🏠 Home