ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
తిరుపతి, ఆగస్టు 4 (రాజనీతి): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ, పుట్టిన అరగంటలోపు తల్లిపాలు ఇవ్వాలని, తొలి ఆరు నెలలు తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆహారమని తెలిపారు. మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రమీలాదేవి, ఆర్ఎంఓ డా. రామనారాయణ రెడ్డి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, బాలింతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.