ఘనంగా రాయల్ ఉద్యోగుల సంక్షేమ సంఘం .నాలుగవ వార్షికోత్సవం ...
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):రాయల్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాలుగోవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక సీఎం కళ్యాణ మండపంలో చదువుల్లో రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయల్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా రాయల రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు రాయల్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకుడు వెంకటేష్ తెలిపారు. ఇంకా సంఘం తరపున ప్రత్యేక కార్యక్రమాలు చేసి సంఘం బలోపేతానికి కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త పర్థసారధి నాయుడు, రాయల ఉద్యోగుల సంక్షేమ సంఘం కోశాధికారి వెంకటేష్, కాజూరు బాలాజీ,జనసేన నాయకులు పూలచందు, మాజీ కార్పొరేటర్ పూర్ణ , శివయ్య ,లతోపాటు పలువురు జనసేన నాయకులు, రాయల్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.