🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 03 Aug, 2026 | Page: 1

మళ్లీ ప్రాణం పోసుకున్న ఆరోగ్యవరం ఫుట్‌బాల్ మైదానం – క్రీడాకారులకు సిద్ధమైన క్రీడా వేదిక

ఆరోగ్యవరం | రాజనీతి 2026 ఆగస్టు 3: ఎన్నో తరాల ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ క్రీడాకారులను తీర్చిదిద్దిన చారిత్రాత్మక ఆరోగ్యవరం ఫుట్‌బాల్ మైదానం పునరుద్ధరణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. దీంతో మైదానం మళ్లీ యువత అడుగులతో కళకళలాడేందుకు సిద్ధమైంది.

జాతీయ రహదారి విస్తరణతో మైదానంలో కొంత భాగం కోల్పోయినప్పటికీ, దాని చరిత్రను, క్రీడా వారసత్వాన్ని కాపాడాలనే సంకల్పంతో ట్రినిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు (Founder & Correspondent) నేషి మరియు జి. రతీష్ బాబు తమ స్వంత నిధులతో పునరుద్ధరణ పనులను ప్రారంభించగా వీరితో పాటు గ్రామ పెద్దలు రాజేష్ సువార్త, ప్రభా, ఆర్.ఎం. సునీల్, స్టాన్లీ కమలేశన్, టీ.లక్ష్మీపతి ప్రత్యక్షంగా పాల్గొని పనుల పర్యవేక్షణతో పాటు యువతను సమన్వయం చేస్తూ విశేష సహకారం అందించి విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ సందర్భంగా నేషి మాట్లాడుతూ, “ఆరోగ్యవరం ఫుట్‌బాల్ మైదానం కేవలం ఒక ఆటస్థలం కాదు… ఇది వేలాది మంది యువకుల కలలకు, క్రమశిక్షణకు, ఐక్యతకు నిలయంగా నిలిచిన చారిత్రాత్మక క్రీడా క్షేత్రం. ఈ మైదానం మళ్లీ యువత విజయాలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నాం.” అని తెలిపారు.

పునరుద్ధరణ పూర్తైన నేపథ్యంలో మైదానం ఇకపై సాధన, స్నేహపూర్వక మ్యాచ్‌లు మరియు టోర్నమెంట్‌ల కోసం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

చివరిగా, ఈ కార్యక్రమానికి అనుమతులు, ప్రోత్సాహం అందించిన CSI రాయలసీమ డయాసిస్ బిషప్ మరియు ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ (AMC) చైర్మన్ ది రైట్ రివ. డా. పి. ఐజాక్ వర ప్రసాద్ గారికి, అలాగే AMC ఇన్‌చార్జ్ డైరెక్టర్ డా. కె. పి. రవీంద్ర గారికి పునరుద్ధరణ కమిటీ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

“ఆరోగ్యవరం అంటే TB వైద్యసేవలకు ప్రపంచ గుర్తింపు… ఆరోగ్యవరం ఫుట్‌బాల్ మైదానం అంటే ప్రతిభకు, క్రమశిక్షణకు, ఐక్యతకు చిరునామా.”
🏠 Home