మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఆహ్వానించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు
పుంగనూరు, ఆగస్టు 3 (రాజనీతి): ఈ నెల 23న మదనపల్లిలో నిర్వహించనున్న ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ అన్నమయ్య జిల్లా మహాసభలకు రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని మంత్రి నివాసంలో ఆహ్వాన పత్రిక అందజేసి మహాసభకు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.