🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 03 Aug, 2026 | Page: 1

స్పటిక లింగ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న పెద్దిరెడ్డి దంపతులు

పుంగనూరు, ఆగస్టు 3 (రాజనీతి): బంగారుపాళ్యం మండలం పాలేరు గ్రామంలోని నూతన శ్రీ కనకాద్రి కైలాసేశ్వర దేవాలయంలో సోమవారం నిర్వహించిన స్పటిక లింగ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సతీమణి స్వర్ణమ్మతో కలిసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారిని సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
🏠 Home