రాష్ట్రస్థాయి ఎస్ఐపీ అబాకస్ పోటీల్లో పీలేరు విద్యార్థుల సత్తా
పీలేరు, ఆగస్టు 3 (రాజనీతి): మంగళగిరిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్ఐపీ అబాకస్ పోటీల్లో పీలేరు కేంద్రానికి చెందిన 25 మంది విద్యార్థులు ప్రతిభ చాటారు. హన్విత ఛాంపియన్‌గా నిలవగా, హేతిక, హాజిరా భాను, రబిహే అంజుమ్ ఫస్ట్ రన్నరప్‌లుగా, హిమేష్, అభినవ్ నందా సెకండ్ రన్నరప్‌లుగా విజయం సాధించారు. పలువురు విద్యార్థులు థర్డ్ రన్నరప్‌గా నిలిచారు. విజేతలను ఎస్ఐపీ అబాకస్ యాజమాన్యం, తల్లిదండ్రులు అభినందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.