🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 02 Aug, 2026 | Page: 1

మాజీ వార్డు సభ్యురాలు రంగమ్మను పరామర్శించిన వైకాపా నేతలు

రేణిగుంట, ఆగస్టు 2 (రాజనీతి): రేణిగుంట మేజర్ గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యురాలు రంగమ్మను వైకాపా పట్టణ అధ్యక్షుడు డాక్టర్ ప్రభాకర్ ఆదివారం స్విమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. అనారోగ్యంతో తిరుపతి శ్రీ పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంగమ్మ ను ప్రభాకర్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. రంగమ్మ కుటుంబానికి వైకాపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత, తిరుపతి 11వ వార్డు వైకాపా సోషల్ మీడియా అధ్యక్షుడు రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home