రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా షేక్ రెడ్డి మస్తాన్ నియామకం....
మైనార్టీల సంక్షేమమే లక్ష్యం: షేక్ రెడ్డి మస్తాన్...
చిత్తూరు (జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు: భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా చిత్తూరు నగరంలోని అశోక్‌పురానికి చెందిన షేక్ రెడ్డి మస్తాన్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ భాషా ప్రకటించారు. షేక్ జవహర్ భాషా, ముంతాజ్ దంపతుల కుమారుడైన మస్తాన్ విద్యార్థి దశ నుంచే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చురుకుగా పనిచేశారు.2014 నుంచి ఏబీవీపీలో కళాశాల ఉపాధ్యక్షుడు, పీసీఆర్ కళాశాల అధ్యక్షుడు, చిత్తూరు బాగ్ కన్వీనర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా కన్వీనర్‌గా 2020 వరకు వివిధ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2021లో బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) చిత్తూరు జిల్లా కార్యదర్శిగా, 2023లో బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.ఈ సందర్భంగా షేక్ రెడ్డి మస్తాన్ మాట్లాడుతూ... మైనార్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి మైనార్టీ కుటుంబానికి చేరేలా కృషి చేస్తానన్నారు.తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్ జీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ భాషా, రాయలసీమ జోనల్ ఇన్‌చార్జి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, కడప జిల్లా ఇన్‌చార్జి చిట్టిబాబు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషిధ రాజు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, యువ నాయకుడు రూపేష్ కుమార్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.