కూటమి పాలనపై వైసీపీ నాయకులు ఆరోపణలు మానుకోవాలి :తెలుగుదేశం యువ నాయకుడు రాయ వెంకటరమణ నాయుడు
వీరబల్లి :
గత కొద్దిరోజులుగా వైసీపీ నాయకులు కూటమి పరిపాలన అభివృద్ధి చూసి ఓర్వలేక కూటమి నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని
తెలుగుదేశం పార్టీ రాజంపేట టీడీపీ యువ నాయకుడు రాయ వెంకటరమణ నాయుడు అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఇసుక దోపిడీకి అండ.. ప్రతిపక్షంలోకి రాగానే రైతుల పట్ల ప్రేమ వలకపోస్తున్నారని తెలిపారు.అక్రమ ఇసుక తవ్వకాలపై ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ నేతలు.. నేడు చెయ్యేరు వద్ద రాజకీయ నాటకాలు ఆడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.అన్నమయ్య ప్రాజెక్టు విపత్తుపై సమాధానం చెప్పకుండా.. ఇప్పుడు చెయ్యేరు ఇసుకపై హడావుడి ఎందుకు 40 మంది నిండు ప్రాణాలు కోల్పోయిన విషాదానికి నైతిక బాధ్యత ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు.ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలై.. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయినప్పుడు వైసీపీ నేతలు ఎక్కడున్నారు.చెయ్యేరు నదిలో ఇసుక తవ్వకాల అంశంపై వైఎస్ఆర్‌సీపీ నాయకులు చేస్తున్న హడావుడి చూస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇసుక వ్యవహారాన్ని అస్తవ్యస్తo చేసి ఇపుడు ఎటువంటి అధికారిక నిర్ధారణ లేకుండానే “60 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మాయం”, “రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల దోపిడీ అంటూ భారీ సంఖ్యలను ప్రచారం చేయడం వెనుక ఉన్న ఆధారాలను వైసీపీ నేతలు ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ ప్రచారం కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో అయోమయం సృష్టించడం సమంజసం కాదన్నారు.కూటమి ప్రభుత్వం నదీ పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణ, రైతుల ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తేలితే, బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రైతుల పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు చేసే ప్రయత్నాలను ప్రజలు నమ్మరని వెంకటరమణ పేర్కొన్నారు.