🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 01 Aug, 2026 | Page: 1

పంటల బీమా నమోదు గడువు పెంచాలి: వైఎస్సార్సీపీ డిమాండ్

చౌడేపల్లి, ఆగస్టు 1 (రాజనీతి): ఖరీఫ్-2026 వాతావరణ ఆధారిత పంటల బీమా నమోదు గడువును ప్రభుత్వం వెంటనే పొడిగించాలని వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు అగ్గిదేవర వెంకటరమణ డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సర్వర్లు సరిగా పనిచేయక నమోదు ఆలస్యమవుతోందని తెలిపారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా బీమా నమోదు గడువును పెంచి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home