🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 01 Aug, 2026 | Page: 1

విద్యారంగ సమస్యల పరిష్కారానికై సమరశీల పోరాటాలకు విద్యార్థిలోకం కదలి రావాలి – యు ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ పిలుపు

పత్రికా ప్రకటన తేదీ: 01-08-2026 స్థలం: మదనపల్లె / అన్నమయ్య జిల్లా

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో దేశంలోనే AP టాప్


అన్నమయ్య జిల్లా యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా విస్తృతస్థాయి సమావేశం మదనపల్లి పట్టణంలో నేచురోపతి కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిలోకం సిద్ధం కావాలి అన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో దేశంలోనే AP టాప్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో విడుదల చేసిన UDISE+ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో ఒక విస్తుపోయే నిజం బయటకు వచ్చింది అన్నారు. సింగిల్ టీచర్ స్కూల్స్ దేశవ్యాప్తంగా 1,00,843 పాఠశాలలు కేవలం ఒకే ఒక్క టీచర్‌తో నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం దేశంలోనే అత్యధికంగా ఏపీలో 16,357 సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. తర్వాతి స్థానాలు ఏపీ తర్వాత జార్ఖండ్, మహారాష్ట్ర వరుస స్థానాల్లో నిలిచాయి. దిన్ని బట్టి కూటమి ప్రభుత్వ విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం అవుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా 54 బీసి వసతి గృహాలను మూసివేయడం దారుణం ఉమ్మడి అన్నమయ్య జిల్లాలో 14 బీసీ సంక్షేమ వసతి గృహాలను మూసివేస్తుండడం తీవ్ర అన్యాయం అన్నారు. ముఖ్యంగా కోడూరు డివిజన్ పరిధిలో ఒక్క బీసీ వసతి బాలురు గృహం కూడా లేకపోవడం వల్ల పేద, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి, మూసివేస్తున్న వసతి గృహాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్.

పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు త్రాగునీటి కోసం ఆర్‌ఓ ప్లాంట్లు, దోమతెరలు, ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

అన్నమయ్య జిల్లా విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రభుత్వ ఐటీఐ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. సమావేశంలో యుఎస్ ఎఫ్ ఐ అన్నమయ్య జిల్లా నాయకులు ఆఫ్రిద్, కమలాకర్, యువరాజ్ మనోజ్ సాయి కుమార్ రెడ్డి రామ్ తేజ సుల్తాన్ సంతోష్ ఆదినారాయణ భాను ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

అభినందనలతో...
ఆఫ్రిద్, కమలాకర్
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (USFI)
అన్నమయ్య జిల్లా కమిటీ
🏠 Home