గుడిపాల మండలంలో ఏనుగుల సంచారం.. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి...
రాత్రి వేళల్లో బయటకు రావొద్దని హెచ్చరిక – సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి....
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని పల్లూరు, వేప్పలమనుచ్చెను, పిల్లరీకుప్పం, పాపసముద్రం, ముత్తువల్లూరు, వీసీ కండిగ, వీఎన్ కండిగ, చిత్తపార గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని గ్రామస్థులు సూచిస్తున్నారు.ఏనుగులు వ్యవసాయ పొలాలు, గ్రామాల సమీపంలో సంచరిస్తుండటంతో రైతులు, కూలీలు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అడవి ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలు రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు.స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల కదలికలను పర్యవేక్షించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల్లో మైకింగ్ నిర్వహించడం, ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొన్నారు.