🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 31 Jul, 2026 | Page: 1

శ్రీ రెడ్డమ్మ తల్లికి వెండి జ్వాలా కిరీటం బహుకరణ

గుర్రంకొండ, జూలై 31 (రాజనీతి): గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలోని శ్రీ రెడ్డమ్మ తల్లి ఆలయానికి రాయచోటికి చెందిన తేజస్విని–చింతం అభిషేక్ రెడ్డి దంపతులు సుమారు కిలో బరువున్న వెండి జ్వాలా కిరీటం, వెండి శఠారి, ప్రసాదం గిన్నె, కర్ణకవచాలను భక్తిపూర్వకంగా సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి వాటిని అలంకరించారు. దాతలను శేషవస్త్రంతో సత్కరించిన ఆలయ చైర్మన్ లంకిపల్లి రాజన్న నాయుడు, ఈవో మంజుల భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి కొనసాగుతోందని తెలిపారు.
🏠 Home