చౌడేపల్లిలో సాంప్రదాయబద్ధంగా అక్కదేవతలకు పచ్చ
చౌడేపల్లి, జూలై 31 (రాజనీతి): మండల కేంద్రం చౌడేపల్లిలో అక్కదేవతలకు శుక్రవారం సాంప్రదాయబద్ధంగా పచ్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని యువత, పెద్దలు కమల ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కగార్లకు పచ్చ సమర్పించారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా చిట్రెడ్డిపల్లి వరకు వెళ్లి అక్కడ అక్కదేవతలకు పచ్చ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.