🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 31 Jul, 2026 | Page: 1

ఆర్బీఎస్‌కే-2.0 ప్రారంభం.. 2.50 లక్షల మందికి ఉచిత కళ్లజోళ్లు

అమరావతి, జూలై 31 (రాజనీతి): రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్‌కే-2.0)ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ ఏడాది 62.65 లక్షల మంది చిన్నారులకు 38 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి ఉచిత చికిత్స అందించనున్నట్లు తెలిపారు. కొత్తగా మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, నిద్రలేమి, మొబైల్ ఫోన్ అధిక వినియోగంతో వచ్చే సమస్యలను కూడా పరీక్షల పరిధిలోకి తీసుకొచ్చారు. 43.30 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, చూపు లోపాలున్న 2.50 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
🏠 Home