పోలీసు లాంఛనాలతో ఏఎస్ఐ బాలకృష్ణుడికి కన్నీటి వీడ్కోలు..
అన్నమయ్య జిల్లా | మదనపల్లి 31.07.2026: -
తీవ్ర దిగ్బాంతిని సంతాపాన్ని వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు..
మదనపల్లె, జులై 31: అన్నమయ్య జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ 250 గా విధులు నిర్వర్తిస్తున్న ముచ్చలపూడి బాలకృష్ణుడు (60) అనారోగ్యంతో వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. శుక్రవారం మదనపల్లెలో ఆయన అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పోలీసు లాంఛనాలతో ముగిశాయి. 1992లో పోలీస్ శాఖలో చేరిన ఆయన పలు స్టేషన్లలో అంకితభావంతో విశేష సేవలందించారు.
ఏఎస్ఐ మృతి పట్ల జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్‌ఐ (వెల్ఫేర్) ఎం. రవికుమార్ గారు మదనపల్లి పట్టణంలోని అమ్మినేని వీధిలో ఉన్న బాలకృష్ణుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని భార్య లక్ష్మీదేవికి అంత్యక్రియలు, తక్షణ ఖర్చుల నిమిత్తం పోలీసు శాఖ తరఫున రూ. 1 లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
బెంగళూరు రోడ్డులోని రెడ్డి సంఘం హాస్టల్ పక్కన ఉన్న శ్మశానవాటికలో శుక్రవారం "స్వర్గస్తులైన ఏఎస్ఐ గారికి ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు బలగాలు, తుపాకులు పేల్చి తమ కడసారి వీడ్కోలు పలికాయి." పోలీసు లాంఛనాలతో ఏఎస్ఐ బాలకృష్ణుడి అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది భారీగా పాల్గొని తమ తోటి ఉద్యోగికి కన్నీటి వీడ్కోలు పలికారు.