🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 31 Jul, 2026 | Page: 1

ప్రజా సమస్యలపై పోరాటాలే సీపీఐ లక్ష్యం: రామానాయుడు

పీలేరు, జూలై 31 (రాజనీతి): ప్రజా సమస్యలపై ఉద్యమాలను బలోపేతం చేయడమే సీపీఐ రాజకీయ శిక్షణ తరగతుల లక్ష్యమని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ. రామానాయుడు అన్నారు. పీలేరులో ప్రారంభమైన మూడు రోజుల జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. రైతులు, కార్మికులు, యువత, మహిళల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home