పీజీఆర్ఎస్ను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలి: ఆర్డీవో విజయలక్ష్మి
పీలేరు, జూలై 31 (రాజనీతి): పీలేరు ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి రెవెన్యూ సిబ్బందితో సమావేశమై ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సిఫారసులకు తావు లేకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఆర్వోఆర్, మ్యుటేషన్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.