🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 30 Jul, 2026 | Page: 1

కోర్టు స్టేటస్‌కో ఉన్నా భూమిలో ఫెన్సింగ్ చేస్తున్నారని ఆరోపణ

కోర్టులో వివాదం కొనసాగుతున్న తమ పూర్వీకుల భూమిలో కోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులను పట్టించుకోకుండా రాతి స్తంభాలు నాటి ఇనుప ఫెన్సింగ్ వేస్తున్నారని స్థానిక కోకావూరుకు చెందిన సి. కవిత ఆరోపించారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. మురకంబట్టు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 105/1లో తన భర్త సి. లోకనాథంనాయుడు పేరుపై 2.14 ఎకరాల సెటిల్‌మెంట్ భూమి ఉందన్నారు. ఆ స్థలంలో ఇప్పటికే ఒక ఇల్లు నిర్మించుకున్నామని, మరో ఇంటి నిర్మాణం చేపడుతుండగా అదే గ్రామానికి చెందిన మనోహర్ తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ఈ భూ వివాదానికి సంబంధించి చిత్తూరు కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, స్టేటస్‌కో ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ మనోహర్ రాతి స్తంభాలు నాటి ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దానిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు చెప్పారు.తమ సర్వే నంబర్‌లో మనోహర్ అక్రమంగా ఇల్లు నిర్మించుకున్న విషయాన్ని ప్రశ్నించినందుకే తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కవిత ఆరోపించారు. రాత్రి వేళల్లో సైతం తమ ఇంటి వద్ద తిరుగుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారని, వికలాంగుడైన తన భర్తతో పాటు తనకూ ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
🏠 Home