🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 29 Jul, 2026 | Page: 1

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక ప్రతి నెల 1వ తేదీనే జీతం, ఆలస్యం చేస్తే అధికారులపై చర్యలు!

జీతాల చెల్లింపులపై ఆర్థికశాఖ కీలక ఆదేశాలు

1️⃣ ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగుల జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
2️⃣ ఈ లక్ష్యాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్థికశాఖ అన్ని శాఖలకు మెమో జారీ చేసింది.
3️⃣ అన్ని కార్యాలయాలు జీతాల బిల్లులను వెంటనే IFMS (Integrated Financial Management System) పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించింది.
4️⃣ జీతాల బిల్లులు సమయానికి అప్‌డేట్ చేయకపోతే సంబంధిత Drawing & Disbursing Officer (DDO)పై చర్యలు తీసుకోవాలని శాఖాధిపతులకు సూచించింది.
5️⃣ ప్రస్తుతం సుమారు 3,900 మంది ఉద్యోగుల ఆధార్ వివరాలు IFMSలో అప్‌డేట్ కాలేదు.
6️⃣ వీరిలో సుమారు 1,900 మంది పొరుగుసేవలు (Outsourcing) మరియు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు.
7️⃣ ఆధార్ అప్‌డేట్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు సచివాలయంలోని ఆర్థికశాఖను సంప్రదిస్తున్నారు.
8️⃣ గతంలో డిప్యుటేషన్‌లో పనిచేసి బదిలీపై కొత్తచోట చేరిన ఉద్యోగులకు కూడా ఆధార్ అప్‌డేట్ సమస్యలు ఎదురవుతున్నాయి.
9️⃣ పొరుగుసేవలు, కాంట్రాక్టు ఉద్యోగుల సేవా కాలాన్ని ఈ నెల కూడా పొడిగించినట్లు ఆర్థికశాఖ తెలిపింది.
🔟 అన్ని శాఖలు వారి జీతాల బిల్లులను వెంటనే పంపించాలని మరోసారి సూచించింది.
1️⃣1️⃣ కేంద్ర ప్రాయోజిత పథకాలలో పనిచేస్తున్న దాదాపు లక్ష మంది ఉద్యోగుల జీతాలకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి విడుదల చేయించుకునే బాధ్యత శాఖాధిపతులదే అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
1️⃣2️⃣ ఈ ప్రక్రియకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌ను రాష్ట్ర నోడల్ అధికారిగా నియమించారు.
1️⃣3️⃣ జీతాల బిల్లులు పెండింగ్‌లో ఉంటే ముందుగానే ఆర్థికశాఖకు తెలియజేయాలని శాఖాధిపతులను ఆదేశించారు.
1️⃣4️⃣ జూలై 30లోపు ఏ ఉద్యోగి జీతాల బిల్లు పంపకపోతే దానికి పూర్తి బాధ్యత సంబంధిత DDOదే అని ఆర్థికశాఖ హెచ్చరించింది.
1️⃣5️⃣ దీంతో అనేక మంది DDOలు సచివాలయానికి వెళ్లి సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.
1️⃣6️⃣ కేంద్ర నిధులు ఆలస్యమైతే రాష్ట్ర ఆర్థికశాఖ తాత్కాలికంగా జీతాల కోసం నిధులు సర్దుబాటు చేస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


రాష్ట్రంలో ప్రతి నెల:

👉🏻ఉద్యోగుల జీతాలకు సుమారు ₹4,500 కోట్లు
👉🏻పింఛన్ల చెల్లింపులకు సుమారు ₹2,500 కోట్లు అవసరమని అంచనా.

ముఖ్యాంశం:

ప్రతి ఉద్యోగికి 1వ తేదీనే జీతం అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ అన్ని శాఖలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
🏠 Home