ఐపీఎల్‌కు రూ.2 లక్షల కోట్ల విలువ.. బ్రాండ్ రేసులో ఆర్సీబీ నంబర్-1, సీఎస్‌కేను దాటేసిన కేకేఆర్!
ఐపీఎల్ వ్యాపార విలువ రికార్డు స్థాయికి.. తొలి రూ.300 మిలియన్ బ్రాండ్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విలువైన లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తాజా బ్రాండ్ విలువల నివేదిక ప్రకారం ఐపీఎల్ మొత్తం వ్యాపార విలువ 20.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.97 లక్షల కోట్లు) దాటింది. గత ఏడాదితో పోలిస్తే 11 శాతానికి పైగా వృద్ధి నమోదై, ప్రపంచ క్రీడా రంగంలో ఐపీఎల్ వ్యాపార సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది.
ఈ నివేదికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలిచింది. దాదాపు 312 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో 300 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి జట్టుగా కొత్త రికార్డు నెలకొల్పింది. అభిమానుల ఆదరణ, వాణిజ్య ఒప్పందాలు, డిజిటల్ ప్రభావం, ఇటీవలి విజయాలు ఆర్సీబీ బ్రాండ్ విలువ పెరగడంలో కీలక పాత్ర పోషించాయి.
ఫ్రాంచైజీల ర్యాంకింగ్‌లో ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మూడో స్థానంలో నిలిచి, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నాలుగో స్థానానికి పడిపోయింది. దీంతో ఐపీఎల్ బ్రాండ్ విలువల జాబితాలో సీఎస్‌కేను కేకేఆర్ అధిగమించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, డిజిటల్ స్ట్రీమింగ్, ఫ్రాంచైజీల్లో భారీ పెట్టుబడులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అభిమానుల సంఖ్య ఐపీఎల్‌ను కేవలం క్రికెట్ టోర్నమెంట్‌గా కాకుండా, బిలియన్ డాలర్ల స్పోర్ట్స్ బిజినెస్‌గా నిలబెట్టాయి.