🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 29 Jul, 2026 | Page: 1

తిరుపతి బైపాస్ అండర్‌పాస్‌పై క్లారిటీ.. వకుళమాత ఆలయం వద్దే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

తిరుపతి బైపాస్‌లోని వకుళ మాత ఆలయం సమీపంలో (కి.మీ. 99.645) ఇప్పటికే ఆమోదం పొందిన అండర్‌పాస్‌ను యథాతథంగా కొనసాగించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ గౌరవ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని కోరడం జరిగింది.
అయితే, ఆ అండర్‌పాస్‌ను ఒమేగా ఆసుపత్రి సమీపం (కి.మీ. 99.230) వైపు మార్చే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం అందింది.
ఈ అంశంపై స్పందించిన గౌరవ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు, మొదట ఆమోదించిన ప్రణాళికలో ఎలాంటి మార్పు ఉండదని, తిరుపతి బైపాస్‌లోని (మల్లవరం జంక్షన్–రేణిగుంట సెక్షన్, NH-71) వకుళ మాత ఆలయం సమీపంలోని కి.మీ. 99.645 వద్దనే అండర్‌పాస్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
🏠 Home