ఈ నెల 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్ష
ఈ నెల 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ
ముసాయిదా ఓటరు జాబితాను ప్రతి ఓటరు తప్పనిసరిగా పరిశీలించాలి
జూలై 31 నుంచి ఆగస్టు 31 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ
రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్ష
మదనపల్లె, జూలై 29:
జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–2026) ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, రాజకీయ పార్టీల సహకారంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇంటింటి సర్వే, కుటుంబ సభ్యుల వివరాల ధృవీకరణ, ప్రజలతో ప్రత్యక్ష సమావేశాలు తదితర అన్ని దశల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు అందించిన సహకారం అభినందనీయమని తెలిపారు. ఇందుకు జిల్లా యంత్రాంగం తరఫున అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో 24.07.2026 నాటికి 12,32,439 మంది ఓటర్ల వివరాల ధృవీకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల వివరాల మ్యాపింగ్‌లో 10,83,736 మంది ఓటర్ల వివరాలను ధృవీకరించి 85.06 శాతం పురోగతి సాధించినట్లు తెలిపారు. ఇంకా మ్యాపింగ్ జరగని 35,458 మంది ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా పరిశీలించి ధృవీకరించినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, గైర్హాజరైన వారు, డూప్లికేట్ నమోదులు తదితర కారణాల ఆధారంగా 1,48,703 (12.07%) మంది ఓటర్ల పేర్లను తొలగింపునకు ప్రతిపాదించినట్లు తెలిపారు.
ప్రతిపాదిత తొలగింపుల వివరాలు
- మరణించిన ఓటర్లు – 48,149
- శాశ్వతంగా వలస వెళ్లిన/లభ్యం కాని ఓటర్లు – 37,909
- గైర్హాజరు ఓటర్లు – 35,397
- డూప్లికేట్ నమోదులు – 26,994
- ఇతర కారణాలు – 254
ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో బూత్ లెవల్ అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, మరణాలు, డూప్లికేట్ నమోదులు తదితర అంశాలపై చర్చించి, సమావేశాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ నెల 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా (Draft Electoral Roll) ప్రచురించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జూలై 31 నుంచి ఆగస్టు 31 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించి, సెప్టెంబర్ 28 నాటికి వాటి పరిష్కార ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
అర్హత ఉన్న ప్రతి ఓటరు ముసాయిదా జాబితాను పరిశీలించి, పేరు పొరపాటున తొలగించబడినా లేదా వివరాల్లో లోపాలు ఉన్నా వెంటనే క్లెయిమ్ దాఖలు చేయాలని సూచించారు. అలాగే మరణించిన వారు లేదా అర్హత లేని వారి పేర్లు జాబితాలో కొనసాగుతున్నట్లయితే సంబంధిత అభ్యంతరాలను నమోదు చేయాలని కోరారు.
ముసాయిదా ఓటరు జాబితా పీడీఎఫ్ ప్రతులను రాజకీయ పార్టీలకు అందజేయడంతో పాటు అవసరమైన అన్ని వివరాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
ఓటర్ల సంఖ్య పెరిగిన ప్రాంతాల్లో 90 కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ సమావేశంలో డీఆర్ఓ వెంకటేశు, కెఆర్ఆర్సీ ఎస్‌డీసీ చంద్రశేఖర్ రెడ్డి, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి, రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, సంబంధిత తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
--------------///--------------
డిఐపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా.