మంచి ఆరోగ్యమే మేలైన భవిష్యత్తుకు పునాది: డిప్యూటీ హెచ్‌ఈఓ కొండయ్య
పీలేరు, జూలై 29 (రాజనీతి): విద్యార్థులు మంచి ఆరోగ్యం, ఉన్నత లక్ష్యాల సాధన కోసం మేలైన జీవన నైపుణ్యాలు అలవర్చుకోవాలని తలుపుల పీహెచ్‌సీ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కొండయ్య సూచించారు. బొడుమల్లువారిపల్లి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య విద్య కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సానుకూల ఆలోచన, క్రమం తప్పని వ్యాయామం, పోషకాహారం, తగిన నిద్ర, మంచి అలవాట్లు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.