🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 29 Jul, 2026 | Page: 1

ఇంటింటి ప్రచారంలో కూటమి సంక్షేమ పథకాల వివరణ

పీలేరు, జూలై 29 (రాజనీతి): కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు పీలేరు పట్టణ యూనిట్ ఇన్‌చార్జ్ కేజీఎన్ రెడ్డి భాష తెలిపారు. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచనల మేరకు ఇందిరానగర్, శ్రీనివాస్‌నగర్ కాలనీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
🏠 Home