🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 29 Jul, 2026 | Page: 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 7 రోజుల జైలు

రేణిగుంట, జూలై 29 (రాజనీతి): రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడికి కోర్టు రూ.10 వేల జరిమానాతో పాటు 7 రోజుల సాధారణ కారాగార శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185(a) కింద నమోదైన కేసులో వడమాలపేటకు చెందిన జి. మస్తాన్ (25) తిరుపతిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరై తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి రూ.10,000 జరిమానాతో పాటు 7 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
🏠 Home