🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 28 Jul, 2026 | Page: 1

అన్నమయ్య జిల్లాలో రూ.245 కోట్ల కొరియన్ పరిశ్రమకు ముందడుగు

మదనపల్లె, జూలై 28 (రాజనీతి): అన్నమయ్య జిల్లాలో రూ.245 కోట్ల పెట్టుబడితో కొరియాకు చెందిన బూయంగ్ కంపెనీ ఫుట్‌వేర్ కాంపోనెంట్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందడుగు పడింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి ఇండస్ట్రియల్ పార్కును పరిశీలించారు. పరిశ్రమ స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని అధికారులు తెలిపారు.
🏠 Home