చిత్తూరు అభివృద్ధికి సీఎం వద్ద ఎమ్మెల్యే వినతి...
నీవా రీటైనింగ్ వాల్ నుంచి యూనివర్సిటీ వరకు ప్రతిపాదనలు...
నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి..
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే, నియోజకవర్గంలో చేపట్టాల్సిన ప్రధాన అభివృద్ధి పనులపై సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు 12వ డివిజన్ ఇంచార్జి గోపీనాథ్, గురజాల సురేష్, సుబ్రమణ్యం నాయుడు కూడా పాల్గొన్నారు.
సమావేశంలో చిత్తూరు నగరం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా నీవా నదికి రీటైనింగ్ వాల్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ప్రతిపాదిత యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను త్వరితగతిన చేపట్టాలని కోరారు. నగరంలో కొనసాగుతున్న ప్రధాన రహదారుల విస్తరణ పనులకు అవసరమైన నిధులను విడుదల చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా అడవిపల్లి పైప్‌లైన్ పనులు, రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని వివరించారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, రవాణా సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతిపత్రంలో కోరినట్లు సమాచారం.ఎమ్మెల్యే సమర్పించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చిత్తూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం సహకారంతో అన్ని ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి కొనసాగిస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.