🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 28 Jul, 2026 | Page: 1

తిరుపతిలో అద్వైత్ లా ఫర్మ్ రజతోత్సవ వేడుకలు ఘనంగా

25 ఏళ్ల న్యాయ సేవలకు గుర్తింపుగా ప్రత్యేక కార్యక్రమం...


ప్రజలకు న్యాయం అందించడమే లక్ష్యమని అతిథుల అభినందనలు...

తిరుపతి(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):అద్వైత్ లా ఫర్మ్ 25వ వార్షికోత్సవం (రజతోత్సవం) మంగళవారం తిరుపతి నగరంలోని డి.ఆర్. మహల్ రోడ్, ఎస్.బి.ఐ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను హైకోర్టు న్యాయవాదులు శ్రీనివాసులు గౌడ్, తిరుపతి హైకోర్టు న్యాయవాది జీ. జ్యోస్న్, చిత్తూరు మరియు తిరుపతి కు చెందిన వి. చంద్రమౌళి, తిరుపతి న్యాయవాది వి. చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 25 ఏళ్లుగా న్యాయ సేవల రంగంలో అందిస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈ రజతోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరై కేక్ కట్ చేసి నిర్వాహకులను అభినందించారు.న్యాయవాదులు ప్రజలకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, సమాజంలో న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. అద్వైత్ లా ఫర్మ్ గత 25 సంవత్సరాలుగా ప్రజలకు న్యాయ పరిరక్షణలో విశేష సేవలు అందిస్తోందని కొనియాడారు.ప్రత్యేక అతిథులుగా జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, సిద్ధారెడ్డి, మొబ్బు దేవనారాయణ రెడ్డి, చిత్తూరు 31వ డివిజన్ కార్పొరేటర్ కోలా కిరణ్, 32వ వార్డు కార్పొరేటర్ పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. న్యాయవాద వృత్తిలో సేవాభావం, నైతిక విలువలు అత్యంత ముఖ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ....ప్రజలకు నాణ్యమైన న్యాయ సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. న్యాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ చట్టబద్ధమైన సహాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా మరింత సమర్థవంతమైన న్యాయ సేవలు అందిస్తూ సమాజానికి సేవ చేయాలని సంకల్పించినట్లు వెల్లడించారు.ఈ వేడుకల్లో న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు కలిపి సుమారు 100 మంది పాల్గొన్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా, చివర్లో అతిథులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం హై కోర్టు అడ్వకేట్ శ్రీనివాసులు గౌడ్ జన్మదిన సందర్భంగా పాల్గొన్న నాయకులు,అడ్వకేట్ లు వారికి శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు..
🏠 Home