మళ్లీ దేశవ్యాప్త ఆందోళనలకు హెచ్చరిక.. ఎఫ్‌ఐఆర్‌లు ఎత్తివేయకపోతే ఉద్యమం పునఃప్రారంభిస్తామని CJP అల్టిమేటం
న్యూఢిల్లీ: విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల తర్వాత ఉద్యమాన్ని విరమించిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి కేంద్రానికి హెచ్చరిక జారీ చేసింది. నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు, ప్రభుత్వం హామీ ఇచ్చిన అంశాలపై లిఖితపూర్వక ఒప్పందాన్ని విడుదల చేయకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.
సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో CJP ప్రతినిధులు మాట్లాడుతూ, జూలై 25న కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో నిరసనకారులపై ఎలాంటి పోలీసు చర్యలు ఉండవని, ఇప్పటికే నమోదైన కేసులను కూడా ఉపసంహరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థుల అరెస్టులు, కొత్త కేసుల నమోదుతో ఆ ఒప్పందం ఉల్లంఘించబడిందని ఆరోపించారు.
ప్రభుత్వం మంగళవారం లోపు లిఖితపూర్వక హామీని అందించాలని, అరెస్టయిన విద్యార్థులను విడుదల చేసి, అన్ని ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని CJP డిమాండ్ చేసింది. ఈ హామీలు అమలు కాకపోతే తిరిగి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, తాజా హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.