🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 27 Jul, 2026 | Page: 1

మదనపల్లెలో సోమవారం జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

పత్రికా ప్రకటన - తేదీ:27.07.2026
అన్నమయ్య జిల్లా - మదనపల్లి

మదనపల్లెలో సోమవారం జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

మొత్తం నమోదైన 83 ఫిర్యాదులలో 52 భూవివాదాలు. మిగతా వాటిలో ఆర్థిక, కుటుంబ వివాదాలు చెరో 7, మోసం 6, ఇతర సమస్యలు 5, న్యూసెన్స్ 4, అలాగే ఎఫ్.ఐ.ఆర్ కు సంబంధించినవి 2 ఉన్నాయి.

భూకబ్జాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు, సైబర్ నేరాలపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఫిర్యాదులపై విచారణ వేగంగా పూర్తిచేసి, నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపాలని ఎస్పీ గారు ఆదేశించారు.
🏠 Home