🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 27 Jul, 2026 | Page: 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 21 రోజుల జైలు శిక్ష

రేణిగుంట, జూలై 27 (రాజనీతి): మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులో ఓ వ్యక్తికి 21 రోజుల సాధారణ కారాగార శిక్ష విధించినట్లు రేణిగుంట అర్బన్ పోలీసులు తెలిపారు. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడు ఈ.ఎం. లోకేష్ (27), కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 185(ఎ) కింద దోషిగా నిర్ధారించిన తిరుపతి స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు అతనికి 21 రోజుల సాధారణ కారాగార శిక్ష విధించింది.
🏠 Home