🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 27 Jul, 2026 | Page: 1

బీజేపీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం : రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్

రేణిగుంటలో ఘనంగా 'మన ఊరు – మన జెండా' కార్యక్రమం



రేణిగుంట, జూలై 27 (రాజనీతి): భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రతిష్ఠాత్మక మన ఊరు – మన జెండా కార్యక్రమంలో భాగంగా రేణిగుంట పట్టణంలో జిల్లా మన ఊరు – మన జెండా కన్వీనర్, మొదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ జెండాను రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఘనంగా ఆవిష్కరించారు. జాతీయ జెండాతో పాటు బీజేపీ పార్టీ జెండా రెపరెపలాడుతుండగా కార్యకర్తలు భారత్ మాతాకీ జై, వందే మాతరం, జై శ్రీరామ్ నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ మాట్లాడుతూ దేశాభివృద్ధి, జాతీయత, సుపరిపాలన, సేవా కార్యక్రమాలే భారతీయ జనతా పార్టీ ప్రధాన సిద్ధాంతాలని తెలిపారు. ఈ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేర్చాలనే లక్ష్యంతోనే మన ఊరు – మన జెండా కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలో అక్టోబర్ నెలాఖరులోపు బీజేపీ జెండా రెపరెపలాడేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ కావడమే తమ లక్ష్యమని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ మాట్లాడుతూ రేణిగుంటలో ఏర్పాటు చేసిన ఈ జెండా కేవలం పార్టీ గుర్తు మాత్రమే కాదని, కేంద్ర ప్రభుత్వం అందించిన అభివృద్ధి నిధులు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేసే సమాచార కేంద్రంగా కూడా పనిచేస్తుందని అన్నారు. త్వరలో ఈ జెండా వద్ద ప్రత్యేక స్కానర్ (QR Code) స్టిక్కర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ స్కానర్‌ను మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేయడం ద్వారా రేణిగుంటకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాల పూర్తి వివరాలను ప్రజలు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. పట్టణ నడిబొడ్డున బీజేపీ జెండాను ఏర్పాటు చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల కమిటీ సభ్యులు, ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం, యువతను పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షించడం, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు, మండల ఇన్‌చార్జి మేలగల సుబ్రహ్మణ్యం రెడ్డి, జెండా కో-పాలక్, రేణిగుంట మండల ప్రధాన కార్యదర్శి సొంగా పురుషోత్తం, మండల అధ్యక్షుడు ప్రేమ్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పీ.కే. గోపి ఆచారి, జిల్లా ఉపాధ్యక్షుడు వేణు ముదిరాజ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్, ఉపాధ్యక్షుడు రమేష్, మండల ఉపాధ్యక్షుడు రాజా రాయల్, పట్టణ అధ్యక్షుడు నరేష్, తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యుడు యతేంద్ర నాథ్, ఉపాధ్యక్షుడు అశోక్, బీజేపీ నాయకురాలు అన్నపూర్ణమ్మ, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, మండల మోర్చా అధ్యక్షులు శ్రీకాంత్, మనోహర్, లాల్, రాజేష్, తొట్టంబేడు మండల అధ్యక్షుడు వేడం కిష్టయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home