ఏపీలో మళ్లీ కరోనా అలజడి.. ఒక్కరోజులో 10 కొత్త కేసులు, మొత్తం సంఖ్య 49కు చేరింది
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 10 కొత్త కోవిడ్-19 కేసులు నమోదుకావడంతో, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 49కు చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ సూచించింది.
ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది స్వల్ప లక్షణాలతోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎవరికీ తీవ్ర ఆరోగ్య సమస్యలు లేవని, అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
వర్షాకాలం నేపథ్యంలో వైరల్ జ్వరాలు, శ్వాసకోశ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్న తరుణంలో, జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రజలు రద్దీ ప్రాంతాల్లో అవసరమైతే మాస్క్‌లు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడు ఇతరులతో సన్నిహితంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.